సింహాచలం ట్రస్ట్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-10T00:09:46+05:30 IST

మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం

సింహాచలం ట్రస్ట్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సస్పెండయ్యారు. ట్రస్ట్ నుంచి భూములను తొలగించి వేరు అవసరాలకు మార్చారని ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా భూముల లెక్క తేల్చాలని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ నిర్వహించాలని ఆదేశించింది. 


 ఈ భూముల వ్యవహారంలో అధికారులపై  ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. రామచంద్రమోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు భూ మార్పిడి అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై వేటు వేశారు. ఇదే ఘటనలో సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సుజాతను కూడా సస్పెండ్ చేశారు. 



Updated Date - 2021-08-10T00:09:46+05:30 IST