Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో వెయ్యి కోట్లు అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం

అమరావతి: మరో వెయ్యి కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. 7.2% వడ్డీతో ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రుణ పరిమితిలో 10 వేల కోట్లు సెక్యూరిటీ బాండ్లను వేలం ద్వారా సమీకరించింది. మరో 500 కోట్లకు మాత్రమే ఏపీకి రుణ పరిమితి మిగిలి ఉంది.  మళ్లీ అప్పు కోసం కేంద్రం దగ్గరకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు వెళ్తున్నారు.  నవంబర్ ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్ల కోసం నిధుల అన్వేషణను అధికారులు మొదలు పెట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement