Abn logo

థండయ్

కావలసిన పదార్థాలు: నీరు - ఒక కప్పు, పంచదార - తీపికి సరిపడా, పుచ్చకాయ గింజలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండిన గులాబి రేకులు - పావు కప్పు, పాలు - అర లీటరు, బాదం - 10, గసగసాలు - ఒక టేబుల్‌ స్పూను, గ్రీన్‌ యాలకులు - అర టీ స్పూను, మిరియాలు - ఒక టీ స్పూను, సోంపు - 100 గ్రా., కుంకుమపువ్వు - 4 కాడలు.


తయారుచేసే విధానం: ఒక కప్పు నీటిలో  గసగసాలు, సోంపు, పుచ్చగింజలు వేసి అరగంట నానబెట్టాలి. వీటితోపాటు ఒక రాత్రి నానబెట్టిన బాదం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పాలను మరిగించి కుంకుమపువ్వు వేయాలి. ఇప్పుడు పంచదార వేసి కలపాలి. గులాబి రేకులు, మిరియాలు, సోంపు కలిపి పౌడరు చేయాలి. పాలల్లో బాదం పేస్టు, మిరియాల మిశ్రమం, యాలకుల పొడి వేసి 3 నిమిషాలు మరిగించి దించేయాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో 3 గంటలు ఉంచాలి. సర్వ్‌ చేసేముందు బాదం తరుగు, గులాబి రేకులతో అలంకరించాలి. 

ఫలూదామ్యాంగో ఐస్‌క్రీమ్బ్లూబెర్రీ లెమనేడ్‌హోలీ కాంజీ!చిలగడదుంప సలాడ్‌ సూపర్‌ సిట్రస్‌ జ్యూస్‌పెసర్ల సలాడ్‌కోల్డ్‌ కాఫీ బ్లాక్‌ బ్యూటీ రోజ్‌ పానీయం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement