రేపు నిరుద్యోగుల చలో తాడేపల్లి
ABN , First Publish Date - 2021-07-18T12:10:36+05:30 IST
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్డెక్కుతున్న నిరుద్యోగులను పోలీసులతో బెదిరించి, నిర్బంధిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని సీపీఐ రాష్ట్ర
విజయవాడ: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్డెక్కుతున్న నిరుద్యోగులను పోలీసులతో బెదిరించి, నిర్బంధిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. శనివారం విజయవాడ దాసరిభవన్‌లో నిర్వహించిన విద్యార్థి, యుజన సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న ‘చలో తాడేపల్లి-సీఎంకు విజ్ఞాపన పత్రం’ కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు.