టీజీ యుజి సెట్ ఎంట్రన్స్ గడువు 19వ తేదీకి పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-10T21:02:53+05:30 IST

తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్,2022 (టీజీ యుజి సెంట్ ఎంట్రన్స్ టెస్ట్)కు దరఖాస్తు గడువును ఈనెల 19వ తేదీ వరకూ పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ అండఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషనల్ సొసైటీ (టీఎస్ డబ్లూఆర్ఈఐఎస్)

టీజీ యుజి సెట్ ఎంట్రన్స్ గడువు 19వ తేదీకి పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్,2022 (టీజీ యుజి సెంట్ ఎంట్రన్స్ టెస్ట్)కు దరఖాస్తు గడువును ఈనెల 19వ తేదీ వరకూ పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ అండఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషనల్ సొసైటీ (టీఎస్ డబ్లూఆర్ఈఐఎస్) కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సులు బీఎస్సీ, బిఏ, బి.కాం, బిబిఏలో ప్రవేశం కోసం ఈ ఎంటన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.


2022,2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ సొషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ అండ్ మెన్ కాలజీల్లో ప్రవేశాలకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కాగా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 10వ తేదీతో గడువు ముగియనుంది. కానీ విద్యార్ధుల సౌకర్యం కోస గడువు తేదీని ఈ నెల 19వ తేదీ వరకూ పెంచినట్టు ఆయన తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వరా తమ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-10T21:02:53+05:30 IST