Austin cityలో పనిచేస్తున్న ప్రవాసులకు ఓ గుడ్ న్యూస్.. గంటకు రూ.1700 పైనే కనీస వేతనాన్ని పెంచుతూ..

ABN , First Publish Date - 2022-06-21T02:19:21+05:30 IST

జీవన వ్యవయాలు పెరుగుతున్న తరుణంలో టెక్సాస్‌ రాష్ట్రంలోని(అమెరికా) ఆస్టిన్ సిటీ కౌన్సిల్(Austin city council) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ(నగర) ఉద్యోగుల కనీస వేతనాన్ని గంటకు 22 డాలర్లు(సుమారు రూ.1700)కు పెంచాలన్న తీర్మానానికి తాజాగా ఆమోదముద్ర వేసింది.

Austin cityలో పనిచేస్తున్న ప్రవాసులకు ఓ గుడ్ న్యూస్.. గంటకు రూ.1700 పైనే కనీస వేతనాన్ని పెంచుతూ..

ఎన్నారై డెస్క్: జీవన వ్యయాలు పెరుగుతున్న తరుణంలో టెక్సాస్‌ రాష్ట్రంలోని(అమెరికా) ఆస్టిన్ సిటీ కౌన్సిల్(Austin city council) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ(నగర) ఉద్యోగుల కనీస వేతనాన్ని గంటకు 22 డాలర్లు(సుమారు రూ.1700)కు పెంచాలన్న తీర్మానానికి తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ దిశగా ప్రణాళిక రూపొందించాలంటూ సిటీ మేనేజర్‌ను కౌన్సిల్ కోరింది. ప్రస్తుత జీవన వ్యయానికి తగినట్టుగా జీతాలు పెంచాలంటూ సిటీ ఉద్యోగులు ఇటీవల కోరిన నేపథ్యంలో నగర పాలక సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 2023 బడ్జెట్‌లో ఈ వేతనాల పెరుగుదల సాధ్యం కాని పక్షంలో వీలైనంత ఎక్కువగా కనీస వేతనాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తామని కౌన్సిల్ పేర్కొంది. వచ్చే నెలలో సిటీ మేనేజర్ తన వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనను కౌన్సిల్ ముందుకు తేనున్నారు. కాగా..  ఈ వేతనాల పెంపు సిటీ వర్కర్లతో పాటూ ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన కంపెనీల ఉద్యోగులకు వర్తించనుంది. మరోవైపు.. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ గన్స్‌ను కొనుగోలుకు కనీస వయసును కూడా పెంచాలన్న తీర్మానానికి కూడా సిటీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. 



Updated Date - 2022-06-21T02:19:21+05:30 IST