విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఫాల్కన్ వాహనంతో పరిస్థితుల పరిశీలన

ABN , First Publish Date - 2022-02-03T14:19:52+05:30 IST

విజయవాడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్టీఎస్ రోడ్డు మీద పోలీసులు భారీగా మోహరించారు.

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఫాల్కన్ వాహనంతో పరిస్థితుల పరిశీలన

విజయవాడ : విజయవాడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్టీఎస్ రోడ్డు మీద పోలీసులు భారీగా మోహరించారు. ఫాల్కన్ వాహనంతో చుట్టుపక్కల పరిస్ధితులను అనుక్షణం పరిశీలిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు చుట్టుపక్కల అన్నివైపులా పికెట్లు ఏర్పాటు చేశారు. మరో నాలుగు పాయింట్ల వద్ద భద్రత అదనంగా ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం నడిచి పోలీసులు తిరుగుతున్నారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ క్రాంతిరాణా టాటా క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. 

Updated Date - 2022-02-03T14:19:52+05:30 IST