పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గణపతి ఉత్సవాలకు అనుమతివ్వాలంటూ స్వామికి, విఘ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఉజ్జయిని ఆఘోర సంస్థ ఉపాధ్యక్షుడు రాజేష్‌నాథ్ ఆగోరి, బీజేపీ నేతలు వెళ్లారు. అయితే ఆలయంలోకి వెళ్లకూడదంటూ పాలకొల్లు పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలోకి అనుమతించాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు.