పది జపనీయ హైకులు

ABN , First Publish Date - 2021-08-16T09:11:04+05:30 IST

ఏం మాట్లాడలేదు అతిథి, ఆతిథ్యమిచ్చినవాడూ తెల్ల చామంతులు...

పది జపనీయ హైకులు

ఏం మాట్లాడలేదు

అతిథి, ఆతిథ్యమిచ్చినవాడూ

తెల్ల చామంతులు

ఒషిమ ర్యొత (1718 - 1787)


ఒక పువ్వు పక్కనున్న పువ్వుని

పోటీదారని అనుకోదు.

అది పూస్తుందంతే-

ఝెంక షిబయమ (1894 - 1974)


నా దగ్గర ఏమీ లేదు-

కానీ ఈ పరవశత్వం..

ఈ శీతలత్వం..

కొబయషి ఇస్స (1763 - 1828)


  సముద్రపు చేపలు, పువ్వులు

గ్రామస్తులకు లేకపోవచ్చు-

కానీ ఈ రోజుటి చంద్రుడున్నాడు.

ఇషర సైకకు (1642 - 1693)



ఒట్టి ఒంటరితనం-

శిశిర సందెచీకటిలో

మరో మహదానందం

యెస బుసొన్‌ (1716 - 1784)


శరత్కాల సాయంత్రం-

ఆమె వచ్చి అడిగింది 

     ‘‘ఇదే సమయం కదూ..’’ 

‘‘లాంతరు వెలిగించడానికి..?’’

ఒచి ఎత్సుజిన్‌ (1656? - 1739?)


     నా ధాన్యం గాదె కాలిపోయింది-

నాకూ చంద్రునికి మధ్య

ఇప్పడెవరూ లేరు.

మిఝుత మసహిడె (1657 - 1723)


కాదు కాదు-

చెర్రీ పూవులు కూడా

ఈ రోజు శశికి సమానం కాలేవు.

నిషియమ సొయిన్‌ (1605 - 1682)


అంతటా ప్రశాంతత-

భూమి అర్ధనిమీలిత నేత్రాలతో

శీతలంలోకి ప్రవేశిస్తోంది.

డకొత్సు ఇద (1885 - 1962)


        మంచు

మంచు మీద పడుతోంది-

మిగిలింది మౌనం.

తనెద సంతొక (1882 - 1940)

Updated Date - 2021-08-16T09:11:04+05:30 IST