విభజన సమస్యలపై మరోసారి సమావేశం

ABN , First Publish Date - 2022-01-12T19:13:04+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు అయింది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు...

విభజన సమస్యలపై మరోసారి సమావేశం

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు అయింది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్రం సమావేశాలు నిర్వహించినా చాలా అంశాలు కొలిక్కిరాలేదు. దీంతో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


సింగరేణితోపాటు అనుబంధ సంస్థ అప్మెల్, విద్యుత్ బకాయిలు, ఏపీ భవన్, ఇతర సంస్థల విభజనతో సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. సింగరేణి కార్పొరేషన్‌తోపాటు అనుబంధ సంస్థలు, ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటర్నీజనరల్ న్యాయసలహా ఇచ్చారు. దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. 

Updated Date - 2022-01-12T19:13:04+05:30 IST