హాంగ్ కాంగ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

ABN , First Publish Date - 2021-10-23T02:45:02+05:30 IST

హాంగ్‌కాంగ్‌లో నివిస్తున్న భారతీయులు కూడా శరన్నవరాత్రి సంబరాలను ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారని ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుల జయ పీసపాటి అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన

హాంగ్ కాంగ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

ఎన్నారై డెస్క్: హాంగ్‌కాంగ్‌లో నివిస్తున్న భారతీయులు కూడా శరన్నవరాత్రి సంబరాలను ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారని ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుల జయ పీసపాటి అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆమె.. దసరా, దీపావళి సంబంధించిన షాపింగ్ హాడావిడి హాంగ్ కాంగ్‌లో కూడా నెల రోజుల ముందే ప్రారంభమవుతుందన్నారు. సాధారణంగా హాంగ్ కాంగ్ లో ఉత్తర భారతీయులు దుర్గ పూజలు, అష్టమి నాడు కన్య పూజలు, విజయదశమి నాడు రావణ దహనం చేస్తారని అన్నారు. ఇదే సమయంలో దక్షిణ భారతీయులు మాత్రం బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. తుంగ చుంగ్‌లోని ఆడపడుచులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జయ పీసపాటి అన్నారు. ఇది వరకు తొమ్మిది రోజులపాటు లిలితా సహస్రనామ పారాయణానికి వెళ్లేటప్పుడు పండ్లు, పూలు, తీసుకెళ్లేవారని.. వాటిని అందరికీ పంపిణీ చేసినప్పటికీ ఎన్నో కొన్ని మిగిలి వృథా అయ్యేవని అన్నారు. ఈ క్రమంలోనే తుంగ చుంగ్‌లోని ఆడపడుచులు వినూత్న ఆలోచన చేశారని అన్నారు. 



తొమ్మిది రోజలపాటు డొనేషన్ బాక్సు ద్వారా విరాళాలు సేకరిస్తూ వచ్చిన డబ్బును పదవ రోజు వృద్ధాశ్రమాలకు, అనాథ పిల్లలకు అందజేస్తున్నట్టు చెప్పారు.  అంతేకాకుండా 9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం మనదని ఆమె అన్నారు. 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో 'బతుకమ్మ' పండుగను పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకొంటున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఫ్లవర్ మార్కెట్‌లో కావాల్సిన పూలను కొనుగోలు చేసి, బతుకమ్మను తయారు చేసి, అందరితో కలిసి సరదాగా పండగ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘బెంగాలీ వారు కూడా కొన్ని నెలలు ముందుగానే ఉత్సవ వేడుకలకి సన్నాహాలు ప్రారంభిస్తారు. దుర్గా అమ్మవారి విగ్రహాన్ని భారత దేశం నుంచి తెప్పించి, పూజారులని, వంట వారిని కూడా ప్రత్యేకంగా భారత దేశం నుంచి పిలుస్తారు. ఎంతో వైభవంగా పూజలు, ప్రసాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రులు వేడుకలు జరపగా, పదవ రోజు అంటే విజయదశమి నాడు "సింధూర ఖేలా" అంటే ముత్తైదువులు ఒకరికి ఒకరు కుంకుమ తో హొలీ ఆడి, మిఠాయిలు పంచుకుని వేడుకలు ముగిస్తారు’ అని పేర్కొన్నారు. అంతేకాకుండాదాండియా నైట్స్, గర్బా నైట్స్ అనే కార్యక్రమాలతో హాంగ్ కాంగ్ దీపావళికి స్వాగతం పలుకుతుందని ఆమె తెలిపారు. 




Updated Date - 2021-10-23T02:45:02+05:30 IST