తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు

ABN , First Publish Date - 2021-10-02T01:22:07+05:30 IST

తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు

తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు

హైదరాబాద్: తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు పడింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేనకు తెలంగాణ ప్రభుత్వం అకాడమీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.యూనియన్ బ్యాంక్‌ సంతోష్ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, అగ్రసేన్ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గల్లంతైన నిధుల మొత్తం పెరుగుతోంది. అకాడమీకే చెందిన మరో రూ.17 కోట్లు గల్లంతైన విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని కార్వాన్‌ యూనియన్‌ బ్యాంకు శాఖలో గత ఏడాది డిసెంబరు నుంచిఈ ఏడాది జూలై వరకూ పలు విడతలుగా రూ.43 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాంకుకు చెందిన సంతో్‌షనగర్‌ బ్రాంచ్‌లో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా జూలై, ఆగస్టు నెలల్లో గల్లంతయ్యాయి. కెనరా బ్యాంకు నుంచి మరో రూ.9 కోట్లను కూడా దారి మళ్లించి కాజేశారు. దాంతో, తాజాగా బయటపడిన రూ.17 కోట్లతో కలిపి మొత్తం కుంభకోణం విలువ రూ.60 కోట్లకు చేరుకుంది.


హైదరాబాద్ తెలుగు అకాడమిలో నిధులమాయం మిష్టరీగా మారింది. అకాడమి ఉద్యోగుల చేతివాటమా? బ్యాంకు ఉద్యోగుల బరితెగింపా ఎటు పాలుపోని పరిస్థితి. కోట్ల నిధుల దారిమళ్లింపుపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం సైతం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ తెలుగు అకాడమి నిధుల దారిమల్లింపు కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. 

Updated Date - 2021-10-02T01:22:07+05:30 IST