బెంగళూరుకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-26T03:44:46+05:30 IST

గురువారం ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు ..

బెంగళూరుకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్: గురువారం ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు.  ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్‎కి చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్‎కి చేరుకోనున్నారు. 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు.  దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ ప్రధాని దేవగౌడతో చర్చించనున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు దేవగౌడతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.  3.45కి దెవగౌడ నివాసం నుంచి హాల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. 4 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్‎కి తిరుగు పయనం కానున్నారు.  సాయంత్రం 5.10కి ప్రగతి భవన్‌కి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. 

Updated Date - 2022-05-26T03:44:46+05:30 IST