Abn logo
Jun 3 2020 @ 12:31PM

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మంగళహాట్ టీఆర్ఎస్ సీనియర్ నేత నందకిషోర్ బిలాల్, కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తర్వాత గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అక్కడ టీఆర్ఎస్ సీనియర్ నేత  నందకిషోర్ బలాల్ స్థానికులకు, వాహనదారులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement