గ్రేటర్‌లో ఫ్రీడమ్‌ పార్కులు

ABN , First Publish Date - 2022-08-10T13:02:02+05:30 IST

గ్రేటర్‌లో ఫ్రీడమ్‌ పార్కులు

గ్రేటర్‌లో ఫ్రీడమ్‌ పార్కులు

నేడు మొక్కలు నాటనున్న ప్రజాప్రతినిధులు


హైదరాబాద్‌ సిటీ: స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఫ్రీడమ్‌ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంస్థ.. ఆ పార్కుల్లో ప్లాంటేషన్‌ చేపడుతోంది. నగరంలో నూతనంగా అభివృద్ధి చేస్తోన్న 75 పార్కుల్లో 10,350 మొక్కలను ప్రజాప్రతినిధులు నేడు నాటనున్నారు. ఒక్కో పార్కులో అందుబాటులో ఉన్న విస్తీర్ణాన్ని బట్టి 75, 750, 7500 మొక్కలు నాటాలని అధికారులు నిర్ధేశించారు. 

Updated Date - 2022-08-10T13:02:02+05:30 IST