డబుల్ ఇంజన్ సర్కార్‌ కోసం పని చేస్తాం: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-07-03T22:31:18+05:30 IST

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్‌ కోసం పని చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఉద్యమ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని చెప్పారు. మోదీ సర్కార్ తెలంగాణకు అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. తెలంగాణలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనన్నారు. కేసీఆర్ కుటుంబమే కేబినెట్‌గా మారిందన్నారు. సీఎం, ఆయన కుటుంబం డిప్రెషన్‌లోకి వెళ్లిందని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌ కోసం పనిచేస్తామన్నారు. 



Updated Date - 2022-07-03T22:31:18+05:30 IST