TS News: ఎమ్మెల్యే కోరుకంటి ఆఫీసు ముట్టడికి సింగరేణి కార్మికుల యత్నం..

ABN , First Publish Date - 2022-09-22T18:08:33+05:30 IST

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు..

TS News: ఎమ్మెల్యే కోరుకంటి ఆఫీసు ముట్టడికి సింగరేణి కార్మికుల యత్నం..

పెద్దపల్లి జిల్లా (Peddapalli Dist.): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (MLA Korukanti Chander) క్యాంపు కార్యాలయం ముట్టడికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు (Contract workers) యత్నించారు. దీంతో పోలీసులు వారిని  అడ్డుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా.. యాజమాన్యం దిగిరాలేదు. దీంతో మూడు డివిజన్ల నుంచి కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించే వరకు వెళ్లమని కార్మికులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-22T18:08:33+05:30 IST