మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక కృషి: సునీతా లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2022-04-28T00:54:39+05:30 IST

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక కృషి: సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరసోధరీమనుల కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ అఫ్రోజ్ తన స్వగృహము నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ముస్లిం సోధరసోధరిమనులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్‌ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని  చెప్పారు. 


రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రూపొందించి అమలు చేస్తుందని, మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సునితా లక్ష్మారెడ్డి కోరారు. అనాధ పిల్లలు, పేద వర్గాల ప్రజలకు బట్టలు, రేషన్ పంపిణీ చేశారు. మహిళలకు ఏ సమస్య వచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కమిషన్ సెక్రెటరీ కృష్ణకుమారి, కౌన్సిలర్స్ కవిత, మంజుష, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-28T00:54:39+05:30 IST