ఐటీలో దేశానికే తెలంగాణ తలమానికం

ABN , First Publish Date - 2020-06-03T05:55:37+05:30 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం పరుగులు తీసింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారి దేశీయ ఐటీ రంగానికే తలమానికంగా...

ఐటీలో దేశానికే  తెలంగాణ తలమానికం

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం పరుగులు తీసింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారి దేశీయ ఐటీ రంగానికే తలమానికంగా నిలిచింది. తెలంగాణ ఎగుమతుల్లో మూడో వంతు ఐటీ పరిశ్రమ నుంచే జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగం ఒకటి. గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) రాష్ట్ర ఐటీ ఎగుమతులు 18 శాతం వృద్ధితో రూ.1.28 లక్షల కోట్లకు చేరాయి. జాతీయ స్థాయిలో ఐటీ ఎగుమతులు 8 శాతం మాత్రమే పెరిగితే.. తెలంగాణ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న  కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుంటే.. కొత్త కంపెనీలు తమ కేంద్రాలను ప్రారంభించడానికి పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు ఐటీ పరిశ్రమ వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించింది.  


ఆకాశమే హద్దు..: హైదరాబాద్‌, తెలంగాణల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఆకాశమే హద్దు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి


  • ప్రస్తుత సంక్షోభ సమయంలో బలమైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అండగా నిలవాలి
  • ఐటీ, ఔషధ రంగంలో సాధించిన పురోగతిని.. ఎలకా్ట్రనిక్స్‌ తయారీ రంగంలో కూడా సాధించాలి. హైదరాబాద్‌లో దీర్ఘకాలంలో టెక్నాలజీ పరిశ్రమ అభివృద్ధికి ఇది చాలా కీలకం. 
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో  కేవలం కొత్త పెట్టుబడులపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించాలంటే.. ఇప్పటికే ఉన్న కంపెనీల వృద్ధి ఎంతో అవసరం. ఈఓడీబీ ఫ్రేమ్‌వర్క్‌ను ఇప్పటికే ఉన్న కంపెనీలకు అమలు చేయాలి. ఇటువంటి చర్య తీసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి.

- వీ రాజన్న, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, టీసీఎస్‌


Updated Date - 2020-06-03T05:55:37+05:30 IST