తెలంగాణలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంపై హైకోర్టులో పిటీషన్

ABN , First Publish Date - 2020-08-13T18:39:23+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం పిటీషన్ దాఖలైంది.

తెలంగాణలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంపై హైకోర్టులో పిటీషన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం పిటీషన్ దాఖలైంది. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని ఉద్యోగులు సవాలు చేస్తూ... తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కరారు. నేడు పిటీషన్‌పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-08-13T18:39:23+05:30 IST