మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

ABN , First Publish Date - 2022-07-06T22:26:54+05:30 IST

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

హైదరాబాద్: మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి తల్లుల మరణాల రేటు 92, శిశు మరణాల రేటు 39 వుండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని తెలిపింది. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి 35700 అంగన్ వాడి కేంద్రాల ద్వారా జనవరి 01, 2015 నుండి ఆరోగ్యలక్ష్మి క్రింద పోషక  ఆహారాన్ని  ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల పనితీరును పర్యవేక్షణ చేసేందుకు 149 ICDC ప్రాజెక్టులను ఏర్పాటుచేసింది. 


ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రాల ద్వారా 4.72 లక్షలమంది మహిళలు, బాలింతలు లబ్ది పొందుతున్నారు. అలాగే 6 సం.ల లోపు వయసు ఉన్న 17.63 లక్షల మంది చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళికి అనుగుణంగా గర్భిణీ మహిళలకు బాలింతలకు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించుటకు ప్రతి రోజు ప్రతి లబ్ది దారునికి ప్రభుత్వం రూ.24.77 లు ఖర్చుచేస్తున్నది. అంగన్ వాడి కేంద్రాల పనితీరుపై లబ్దిదారులు, ప్రజల స్పందనలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అంగన్ వాడి హెల్ప్ లైన్ నెం.155209 ను నెలకొల్పింది. అంగన్ వాడి కేంద్రాల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేస్తున్నది. తీవ్రమైన పోషకాహార లోపం తో ఉన్న పిల్లల, ఆరోగ్య సంరక్షణకు బాలామృతం కార్యక్రమం ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ , అదనపు ఫీడింగ్ పథకాన్ని కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్నది. 


పిల్లల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టుటకు ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ప్రభుత్వం కృషి ఫలితంగా 2022 నాటికి తల్లుల మరణాల రేటు జాతీయ సగటు (103) కంటే తక్కువగా 56 గా నమోదయినది , శిశు మరణాల రేటు దేశ సగటు కంటే (32) తక్కువగా తెలంగాణలో 23 గా వుంది.ఆసుపత్రులలో ప్రసవాలు 2014 లో 91 % ఉండగా 2022 లో 97% గా నమోదైంది. దేశ సగటు(79) కంటే ఎక్కువ శాతం ఆసుపత్రులలో ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో  2014 సం.లో ప్రసవాల రేటు 30 % కాగా 2022 సం.లో 56 %  కు పెరిగింది.3 నుండి6 సంవత్సరాల మధ్య  వయసు గల పిల్లల కు డిజిటల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ను అందించుటకు T. SAT విద్య ఛానల్ ద్వారా  ప్రతి రోజు ఒక గంట పాటు ప్రత్యేక  విద్య కార్యక్రమాలను ప్రభుత్వం ప్రసారం చేయిస్తున్నది.



అంగన్ వాడి కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరాను  మెరుగు పరిచేందుకు ప్రత్యేక  వ్యవస్థను ప్రభుత్వం  నెలకొల్పింది. ISO 2000:2005 సర్టిఫికేట్ పొందిన తెలంగాణ ఫుడ్స్ ద్వారా ఉత్పత్తి చేసిన బాలామృతంతో పాటు పోషక విలువలున్న  విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాన్ని స్నాక్స్ గా 6 సంవతరాలలోపు పిల్లలకు ప్రభుత్వం సప్లై చేస్తున్నది.ఆధునిక పద్దతి లోప్యాకింగ్ చేసిన బాలామృతం ఆహారాన్నితెలంగాణలోని అంగన్ వాడి  కేంద్రాల తో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేస్తున్నది.

 

గర్భిణీలు, బాలింతలు , చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్ వాడి ఉద్యోగుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం గణనీయం గా పెంచింది. ప్రధాన అంగన్ వాడి టీచర్ కు రూ.13,650, మినీ అంగన్ వాడి టీచర్ , హెల్పర్స్ కు రూ. 7800 లను ప్రతినెల గౌరవవేతనంగా చెల్లిస్తున్నది.అంగన్ వాడి కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాలలో లలో తెలంగాణ ఒకటిగా నిలిచింది.అలాగే అటు చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అంగన్ వాడి టీచర్లు, హెల్పర్స్ కు 67411 పోచంపల్లి చేనేత చీరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 


Updated Date - 2022-07-06T22:26:54+05:30 IST