కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-08T22:17:22+05:30 IST

కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కోర్టు కేసుల నేపథ్యంలో సోమవారం సమావేశానికి హాజరుకాలేమని లేఖ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కోర్టు కేసుల నేపథ్యంలో సోమవారం సమావేశానికి హాజరుకాలేమని లేఖ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరో రోజున సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ లేఖ రాశారు. ఇటీవల కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. 2021-22 ఏడాదికి కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో పంచాలని ప్రభుత్వం కోరింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలని ఈఎన్‌సీ  కోరింది. ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-08-08T22:17:22+05:30 IST