ఏపీ తీరుతో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం: తెలంగాణ ఈఎన్‌సీ

ABN , First Publish Date - 2021-10-26T22:28:42+05:30 IST

ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని

ఏపీ తీరుతో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం: తెలంగాణ ఈఎన్‌సీ

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాసారు. సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకున్నారని  తెలంగాణ ఈఎన్‌సీ ఆరోపించారు. ప్రాజెక్ట్ రిపోర్టును గత ప్రభుత్వాలు ఖాతరు చేయలేదని ఈఎన్‌సీ పేర్కొన్నారు. ఏపీ చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టును ఆపాలని బోర్డును కోరామన్నారు. పిన్నపురం ప్రాజెక్ట్‌కు ఏపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదుని ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీల నీరే తీసుకోవాలని ఈఎన్‌సీ పేర్కొన్నారు. కానీ పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలకు ఏపీ భారీగా నీరు తరలిస్తోందని ఈఎన్‌సీ ఆ లేఖలో ఆరోపించారు. దీంతో ఏపీ తీరుతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని లేఖలో ఈఎన్‌సీ మురళీధర్ పేర్కొన్నారు. 

 

Updated Date - 2021-10-26T22:28:42+05:30 IST