హైదరాబాద్: సామాజిక, విద్య, ఉపాధి,ఆర్ధిక, రాజకీయ రంగాలు, సంప్రదాయ వ`త్తులలో బిసిల వాస్తవిక జీవన స్ధితిగతులను నిర్ధిష్టంగా సమాచారాన్ని సేకరించడానికి తెలంగాణ బిసి కమిషన్(telangana bc comission) కసరత్తు వేగవంతం చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులలో ఇచ్చిన ‘టర్స్మ్ ఆఫ్ రెఫరెన్స్’కు అనుగుణంగా రాష్ట్ర బిసి కమిషన్ అధ్యయనం మొదలు పెట్టింది. అందులో భాగంగా బుధవారం కర్నాటక బిసి కమిషన్(karnataka bc comission) తో సుదీర్ఘంగా భేటీ అయ్యింది. తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క`ష్ణమోహన్ రావు సారధ్యంలో సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కిశోర్ గౌడ్ తో కూడా టీమ్ కర్నాటక బిసి కమిషన్ ఛైర్మన్ జయప్రకాశ్ హెగ్డే, సభ్యులు రాజశేఖర్ బిఎస్, కళ్యాణ్ కుమార్, సువర్ణ, అరుణ్ కుమార్, శారదనాయక్, సభ్యకార్యదర్శి కెఎ దయానంద్ తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు.
గత కర్నాటక బిసి కమిషన్లు హవనూర్, వెంకటస్వామి, కాంతారాజ మొదలైనవి చేపట్టిన సమగ్ర సర్వే పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల కొనసాగింపులో సుప్రీమ్ కోర్టు నిర్ధేశించిన ‘త్రిబుల్ టెస్ట్’కొలమానాల నేపధ్యంలో ఇరు కమిషన్లు ప్రత్యేకంగా చర్చించాయి. ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, కార్యరంగంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఇతర అంశాలపై వివరాలను సేకరించారు. పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. గత కర్నాటక కమిషన్లు రూపొందించిన మెథడాలజీ, ప్రశ్నావళి, అవలంభించిన పద్దతుల పై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను, ఉత్తర్వులను, చట్టాలను కర్నాటక బిసి కమిషన్ నుంచి సేకరించారు.
ఇవి కూడా చదవండి