తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-14T15:44:05+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై చర్చ జరుగనుంది. ఇరిగేషన్ , పంచాయతీ రాజ్, రోడ్లు మరియు భవనాలు, విద్యుత్, దేవాదాయ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌పై చర్చించనున్నారు. నేడు సభలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. అంతకుముందు యాసంగిలో వరి పంట కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్...

Updated Date - 2022-03-14T15:44:05+05:30 IST