Abn logo
Oct 1 2021 @ 10:42AM

అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం

హైదరాబాద్: మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, కౌన్సిల్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక మొత్తంలో పంట నష్టం, రైతుకు అపారమైన నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.

ఇవి కూడా చదవండిImage Caption