తెలంగాణలో చిక్కుకున్న 250 కోట్ల తెలుగు వర్సిటీ ఆస్తులు

ABN , First Publish Date - 2020-02-24T09:10:33+05:30 IST

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యూనివర్సిటీకి చెందిన రూ.250 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఇరుక్కు పోయాయని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో

తెలంగాణలో చిక్కుకున్న 250 కోట్ల తెలుగు వర్సిటీ ఆస్తులు

  • తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి 

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 23: రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యూనివర్సిటీకి చెందిన రూ.250 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఇరుక్కు పోయాయని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఫీలాంత్రోఫిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తున్న వివిధ రాష్ట్రాల రచయితలు, కవులు, సాహితీవేత్తలకు గోదావరి సాహితీ పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన జాతీయ పురస్కార మహోత్సవం కార్యక్రమానికి.. ముఖ్య అతిథిగా లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బ్రౌన్‌ మందిరం నిర్వాహకులు సన్నిధానం శాస్త్రి కలిసి తెలుగు వర్సిటీని రక్షించాలని కోరారు.

Updated Date - 2020-02-24T09:10:33+05:30 IST