జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో తేజకు రజతం

ABN , First Publish Date - 2021-09-02T21:19:33+05:30 IST

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో తేజకు రజతం

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో తేజకు రజతం

ఖైరతాబాద్‌ సెప్టెంబర్‌1 (ఆంధ్రజ్యోతి): కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని ఖైరతాబాద్‌కు చెందిన సాయి సాయి కృష్ణ తేజ నిరూపించాడు. చదువుతో పాటు కిక్‌ బాక్సింగ్‌లో రాణిస్తూ అటు కుటుంబసభ్యులకు, ఇటు తెలంగాణకు పేరు తెస్తున్నాడు. ఇటీవలే నగరంలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం సాధించిన తేజ వెంటనే గోవాలో జరిగిన నేషనల్‌ కిక్‌ బలాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌-2021లో పాల్గొని రజత పతకం సాధించాడు. చివరి పోరులో తమిళనాడుకు చెందిన ఆటగాడితో కేవలం 2 పాయింట్ల తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోయిన తేజ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. ఖైరతాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ కుమారుడైన తేజ జాతీయ స్థాయి పతకం సాధించి బుధవారం ఖైరతాబాద్‌కు రాగా రైల్వేగేటు నుండి గాంధీనగర్‌ వరకు ఖైరతాబాద్‌ వాసులు భారీ ఊరేగింపు నిర్వహించి తేజను అభినందించారు. ఎఐసిసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌, ఖైరతాబాద్‌ కార్పోరేటర్‌ విజయారెడ్డి, మాజీ కార్పోరేటర్‌ ఎస్‌కె షరీఫ్‌, నాయకులు మహేష్‌ యాదవ్‌,మధుకర్‌ యాదవ్‌, వైల ప్రవీణ్‌, కమ్మరి వెంకటేష్‌ ,అంజయ్య, తదితరులు తేజను సత్కరించి అభినందించారు. వచ్చే సంవత్సరం బ్యాంకాక్‌లో జరిగే 6వ ఏషియన్‌ ఇండోర్‌ అండ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీలకు ఎంపికయ్యానని, అందులో పతకం సాధించేందుకు కృషి చేస్తున్నానని సాయి కృష్ణ తేజ తెలిపారు.



Updated Date - 2021-09-02T21:19:33+05:30 IST