బీజేపీలోకి తీన్మార్ మల్లన్న!
ABN , First Publish Date - 2021-10-01T08:25:19+05:30 IST
జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ బీజేపీలో చేరనున్నారని ఆయన టీం ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ బీజేపీలో చేరనున్నారని ఆయన టీం ప్రకటించింది. ప్రధాని మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని పేర్కొంది. కాగా.. రిమాండ్‌లో ఉన్న తన భర్తను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను మల్లన్న సతీమణి మమత మెయిల్ ద్వారా కోరారు.