20కత్తిపోట్లు తిని కూడా ఫైట్.. దొంగలను తరిమేసిన టెకీ!

ABN , First Publish Date - 2020-07-11T04:50:44+05:30 IST

కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట చిక్‌మంగళూరుకు వెళ్తోంది. హైవేపై ఉండగా కొందరు దోపిడీ దొంగలు ఓ జంటను దోచుకోవడం వారి కంటబడింది.

20కత్తిపోట్లు తిని కూడా ఫైట్.. దొంగలను తరిమేసిన టెకీ!

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట చిక్‌మంగళూరుకు వెళ్తోంది. హైవేపై ఉండగా కొందరు దోపిడీ దొంగలు ఓ జంటను దోచుకోవడం వారి కంటబడింది. వాళ్లకు సాయం చేద్దామని కేకలు వేసిందా జంట. అంతే బైకులపై వెంటనే వారి కారును అడ్డగించిన దొంగలు.. కత్తితో కారులోని టెకీపై దాడి చేశారు. ఈ ఘటనలో అతని చేతులమీదా, మొహం మీదా దాదాపు 20పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆ సమయంలో అతని పక్కనే కూర్చొని ఉన్న భార్య.. ఎక్సిలేటర్‌ను బలంగా అదిమి కారు ఎదురుగా ఉన్న దొంగల బైకులను ఢీ కొట్టింది. దీంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-07-11T04:50:44+05:30 IST