ప్రాక్టీస్ అదుర్స్!

ABN , First Publish Date - 2021-07-06T11:34:19+05:30 IST

శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా అదరగొడుతోంది. రెండు జట్లుగా విడిపోయిన టీమిండియా.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో..

ప్రాక్టీస్ అదుర్స్!

శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా అదరగొడుతోంది. రెండు జట్లుగా విడిపోయిన టీమిండియా.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండూ జట్లూ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయని బీసీసీఐ వెల్లడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ధవన్‌ జట్టు అద్భుతంగా రాణించిందని. కెప్టెన్‌ ధవన్‌(47) తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకోగా, రుతురాజ్ గైక్వాడ్ (63), మనీష్ పాండే(51) అర్థశతకాలతో కదం తొక్కారని తెలుస్తోంది. ఇక ప్రత్యర్థి జట్టులో కెప్టెన్‌ భువనేశ్వర్ కుమార్‌కు 2 వికెట్ల దక్కగా మిగతావారు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. అయితే భువీ జట్టు ఎంత స్కోర్ చేసింది..? ఎవరు గెలిచారు..? వంటి వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు.


ఇదిలా ఉంటే, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో, ధవన్ కెప్టెన్సీలో భారత క్రికెట్లోనే తొలిసారిగా టీమిండియా రెండో జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో భారత్.. లంకతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఇందు కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 


భారత జట్టు:

శిఖర్‌ ధవన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతం, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా





Updated Date - 2021-07-06T11:34:19+05:30 IST