పోలీసులకు సెల్యూట్‌

ABN , First Publish Date - 2020-04-12T10:10:07+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పోలీసులను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ ఇషాంత్‌ శర్మ, డబుల్స్‌ ...

పోలీసులకు సెల్యూట్‌

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పోలీసులను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ ఇషాంత్‌ శర్మ, డబుల్స్‌ మాజీ షట్లర్‌ గుత్తా జ్వాల, మాజీ లాంగ్‌జంపర్‌ అంజూ బాబీజార్జ్‌ ప్రశంసించారు. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని విరాట్‌, ఇషాంత్‌, జ్వాల, అంజూ చేసిన వీడియో సందేశాలను ఢిల్లీ పోలీసులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ పోలీసులు నిజాయతీగా విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఆహారాన్ని అందజేస్తున్నారు. వాళ్లకు సెల్యూట్‌ చేస్తున్నా. మీ సేవలను ఇలాగే కొనసాగించండి’ అని తన వీడియోలో విరాట్‌ కొనియాడాడు. పగలు, రాత్రి అన్నది లేకుండా నిర్విరామంగా పోలీసులు కష్టపడుతున్నారని ఇషాంత్‌ పేర్కొనగా.. ఈ సమయంలో ప్రజలందూ ఇళ్లలోనే ఉంటూ పోలీసులకు సహకరించాలని జ్వాల, అంజూ ట్వీట్‌ చేశారు.  


Updated Date - 2020-04-12T10:10:07+05:30 IST