టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ABN , First Publish Date - 2022-03-19T14:26:54+05:30 IST

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. హ్యాక్‍ను గుర్తించిన ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది.

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

అమరావతి: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయం గుర్తించిన ఐటీ విభాగం.. వెంటనే అప్రమత్తమైంది. ట్విట్టర్‌లో అసభ్య మెసేజ్‍లు పంపినట్టు గుర్తించింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం స్పష్టం చేసింది. మరోవైపు టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు ట్వీట్ చేశారు. ఈ అకౌంట్‌ని పునరుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని లోకేష్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.





Updated Date - 2022-03-19T14:26:54+05:30 IST