అమరావతి: మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఫిట్నెస్కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రికి గుండెపోటు రావడం అత్యంత విచారకరమన్నారు. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వచ్చినా వినయం, విధేయతలు ఆయన చిరునామా అని తెలిపారు. ఐదుపదుల వయస్సులోనే హుందా గల రాజకీయవేత్తగా పేరు గాంచిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మనకి దూరం కావడం తీరని విషాదమని ఆవేదన చెందారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు లోకేస్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి