అమరావతి: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వక్త, ఆర్ధిక మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడు, అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఘనత ఆయనదే అని అన్నారు. రోశయ్య మృతితో రాష్ట్రం గొప్ప అనుభవశాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు యనమల రామకృష్ణుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.