Yanamala ramkrishnudu: జగన్‌కు ప్రివిలేజ్ నోటీసులివ్వాలి

ABN , First Publish Date - 2022-09-22T18:43:56+05:30 IST

అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రివిలేజ్ నోటీసులివ్వాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Yanamala ramkrishnudu: జగన్‌కు ప్రివిలేజ్ నోటీసులివ్వాలి

అమరావతి: అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (Jagan mohan rddy)కి ప్రివిలేజ్ నోటీసులివ్వాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamal ramakrishnudu) డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏకపక్షంగా సభ నిర్వహణ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంతృత్వానికి ప్రయత్నాలు దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులుండరని తెలిపారు. చట్ట సభల ప్రతిష్టకు, గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం(AP Government) వ్యవహరిస్తోందని విమర్శించారు. ట్రెజరీ నియమావళి పాటించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే రూ.26,839 కోట్లు చెల్లించారని... రూ.9,124 కోట్లకు సంబంధించి ఆర్ధిక శాఖ వద్ద వివరనే లేదన్నారు. కనీసం జీవోలు కూడా విడుదల చేయకుండా రహస్యంగా రూ.8,891 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఏ శక్తి పనిచేస్తుందని టీడీపీ నేత (TDP Leader) నిలదీశారు.


గత ఐదేళ్ల కంటే 20-21లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైందని కాగ్ స్పష్టం చేసిందని అన్నారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డి(AP CM)కి స్థానిక సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పంచాయతీలకు సంబంధించిన రూ.854 కోట్లు 14 వ ఆర్దిక సంఘం నిధులు కొల్లగొట్టారని ఆరోపించారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గర్భిణులు ప్రధానమంత్రి మాతృవికాస యోజన కింద ఇచ్చే రూ.5 వేలు కోల్పోయారని అన్నారు. ఇదేనా మీరు సాధించిన అభివృధ్ది అంటూ యనమల రామకృష్ణుడు (Former minister) ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-22T18:43:56+05:30 IST