వారి మాటలు వినకండి...నా సలహా వినండి జగన్ గారు: వర్ల

ABN , First Publish Date - 2020-08-12T18:13:27+05:30 IST

శిరోముండనం కేసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

వారి మాటలు వినకండి...నా సలహా వినండి జగన్ గారు: వర్ల

అమరావతి: శిరోముండనం కేసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వానికి "దళిత వ్యతిరేకి" అనే ముద్ర పడకుండా చూసుకోండి. వెంటనే శిరో ముండన కేసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయండి. మీ సలహా దారుల మాటలు వినకండి...నా సలహా మాత్రమే విని అతన్ని అరెస్టు చేసి మీ ప్రభుత్వ గౌరవం కాపాడుకోండి. లేదా దళిత ద్రోహిగా మిగిలి పోతారు. వినండి’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-08-12T18:13:27+05:30 IST