Abn logo
Aug 14 2020 @ 15:55PM

అక్రమాలకు సహకరించడం లేదనే బదిలీలు: శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు: పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వందల నుంచి వేలకు చేరిందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా అధికారులను బదిలీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అక్రమాలకు సహకరించడంలేదనే కారణంగానే కలెక్టర్, జేసీల నుంచి జిల్లా అధికారుల వరకు అందర్నీ బదిలీ చేస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్ అనుచరుడు షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమ అక్రమాలకు సహకరించని అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కరోనా నియంత్రణ కోసం కేంద్రం రూ.8వేల కోట్లు ఇస్తే.. కరోనా పరీక్షలు చేయడానికి మూడు నేలలు పట్టిందని విమర్శించారు. జీజీహెచ్‌లో సిటీ స్కాన్ లేదంటే సిగ్గుచేటు మండిపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement