గుంటూరు: జీవోలపై టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ నిరసనకు దిగారు. జీవో ప్రతులను బాబు రాజేంద్రప్రసాద్ బోగి మంటల్లో వేశారు. 30-35 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో డబ్బు వసూలు చేయడం దారుణమన్నారు. ఖజానాకు చేరాల్సిన ఆదాయాలను దారి మళ్లించే జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలు ఇబ్బంది పడేలా సీఎం జగన్ ప్రభుత్వం జీవోలు తెస్తోందని బాబు రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి