అమరావతి: రాజ్యాంగం గురించి మంత్రి బొత్స మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వోక్స్ వ్యాగన్ విషయాలు మాట్లాడే దమ్ము బొత్సకు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పేదలకు కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం తమకెక్కడిదని నిలదీశారు. ఓటీఎస్ మాటున డ్వాక్రా సొమ్మును కాజేస్తున్నారని అనురాధ ఆరోపించారు.