అమరావతి: శ్రీవారి దర్శనం టికెట్లపై టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు తప్పని టీడీపీ నాయకుడు నారా లోకేష్ అన్నారు. టీటీడీ ధార్మికమండలిని జగన్ దోపిడీ మండలిగా మార్చారని ఆయన ఆరోపించారు. శ్రీవారి సేవా టికెట్లను పాలక మండలి దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నారన్నారు. ప్రసాదం, వసతి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచే ఆలోచన దుర్మార్గమన్నారు. 31 కేసుల్లో నిందితుడైన సీఎం జగన్రెడ్డి క్రిమినల్ కేసులున్న 16 మందిని బోర్డు సభ్యులుగా నియమించారని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి