రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉండటం దురదృష్టకరం: నక్కాఆనంద్‌బాబు

ABN , First Publish Date - 2020-05-23T16:08:37+05:30 IST

రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉండటం దురదృష్టకరం: నక్కాఆనంద్‌బాబు

రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉండటం దురదృష్టకరం: నక్కాఆనంద్‌బాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రభుత్వ నిర్ణయాలపై 63సార్లు హైకోర్టు అంక్షింతలు వేసిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రజలపట్ల, పాలనపై ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు చాలా బాధాకరమని ఆయన తెలిపారు. కోర్టులతో రోజు మొట్టికాయలు వేయించికుంటున్న ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమైని వ్యాఖ్యానించారు. గతంలో కోర్టు సూచనలు, సలహాలు ఇస్తే సీఎంలు గానీ, మంత్రులు గానీ నైతిక బాధ్యత వహించేవారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే ఏమాత్రం అంటే లెక్కలేదన్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. కోర్టు తీర్పులను కూడా అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సాక్షాత్తు భారత అత్యున్నతన్యాయస్థానం ఇచ్చిన సూచనలను కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు కోర్టు తీర్పులు ముందే తెలుస్తున్నాయని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్కలేదని...కుంటి సాకులు చూపైనా వాళ్లు అనుకున్నదే అమలు చేయాలని చూస్తున్నారని  నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-23T16:08:37+05:30 IST