గుంటూరు: జగన్ పాలనలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జగన్ అధికారం చేపట్టాక వ్యవసాయం కుదేలయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు (Nakka anandbabu) విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలు.. దగా కేంద్రాలుగా మారాయన్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించటం ప్రభుత్వానికి సిగ్గుచేటని నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి