అమరావతి: ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసి తెచ్చిన జీఓలు రద్దు చేసే వరకూ పోరాడుతామని టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పేద విద్యార్థుల పాలిట వరమన్నారు. ప్రభుత్వాలు విద్య కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువేనన్నారు. శాసనసభ, మండలి, బయట కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నామని ఆయన పేర్కన్నారు.