అమరావతి: రామతీర్థం ఆలయ నిర్మాణ శంకుస్థాపన వద్ద జరిగిన ఘటనపై టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి అనువంశిక ధర్మకర్తని గౌరవించడం ఏం తెలుస్తుంది? అని అన్నారు. గాడిదకు గంధం వాసన తెలియనట్టే! అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం దోచి దాచుకునే వైసీపీ నేతలకు, నీతి నిజాయితీ - దానం గుణం గల మహారాజు అశోక్ గజపతిరాజు గొప్పతనం తెలియదన్నారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు తెలియకుండానే బోడికొండపై రామాలయ నిర్మాణం తలపెట్టడం, నిబంధనలు ఉల్లంఘనపై ప్రశ్నించిన రాజుపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో విఫలమైన మంత్రులు ఇప్పుడు ఏకంగా దేవాలయాల సంప్రదాయాలు పాటించకుండా అపచారం తలపెడుతున్నారని లోకేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి