అరుదైన రాజకీయ నాయకుల్లో కోడెల ఒకరు: కాల్వ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2020-09-16T19:23:25+05:30 IST

అరుదైన రాజకీయ నాయకుల్లో కోడెల శివప్రసాదరావు ఒకరని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

అరుదైన రాజకీయ నాయకుల్లో కోడెల ఒకరు: కాల్వ శ్రీనివాసులు

అనంతపురం: అరుదైన రాజకీయ నాయకుల్లో కోడెల శివప్రసాదరావు ఒకరని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కోడెల ప్రథమ వర్ధంతి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాసులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయి డాక్టర్‌‌గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పల్నాడు రాజకీయాలను మూడున్నర దశాబ్ధాలుగా శాసించారని... ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించేవారని ఆయన తెలిపారు. కీలక సమయాల్లో కోడెల పాత్ర అద్వితీయమని కొనియాడారు. నవ్వాంధ్ర తొలి స్పీకర్‌గా పని చేశారన్నారు.


రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అకారణంగా వేధించి వేధించి ఆత్మాభిమానం కలిగిన కోడెల శివప్రసాదరావు తన ప్రాణాలు తానే తీసుకునేలా చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇది చాలా బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. మొదటి వర్ధంతి జరుపుకోవాల్సి రావడం చాలా బాధాకరమన్నారు. అరుదైన నాయకుడికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరుపున ఘనమైన నివాళులర్పిస్తున్నామని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-16T19:23:25+05:30 IST