అమరావతి: విజయవాడ నగరంలో టీడీపీ నేత వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని ఆ పార్టీ నాయకుడు కళా వెంకట్రావు అన్నారు. నిందితులను పట్టుకోకుండా వైసీపీ నేతలు కట్టుకథలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టడానికే ఈ తతంగమన్నారు. తెచ్చిన రూ.6 లక్షల కోట్లు అప్పు ఏమైందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కక్షలు, ముఠా తగాదాలు, కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు.
ఇవి కూడా చదవండి