దేవినేని ఉమా నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-03-08T16:57:33+05:30 IST

గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

దేవినేని ఉమా నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి: గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దేవినేని ఉమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మైలవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్షం పిలుపునిచ్చిన మైలవరం బంద్ కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ నేతను గొల్లపూడి కార్యాలయం దగ్గర పోలీసులు నిలిపివేశారు. దీంతో రెండు గంటలుగా దేవినేని ఉమా కారులోనే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. దేవినేని నివాసం వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. 

Updated Date - 2022-03-08T16:57:33+05:30 IST