అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామమని...కానీ వైసీపీ, దళితులను మరోసారి మోసం చేయడానికి వేసిన మరో ఎత్తుగడలా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడం మాత్రమే కాకుండా.. అంబేద్కర్ విదేశీ విద్యతో పాటు రద్దు చేసిన 28 ఎస్సీ సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టే ముందు.. ఎప్పుడో ప్రకటించిన.. అంబేద్కర్ స్మృతి వనం ఏమైందో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. దళితులు వైసీపీ నాయకుల మాటలకు మోసపోవద్దని దేవతోటి నాగరాజు సూచించారు.
ఇవి కూడా చదవండి