అమరావతి: జగన్ రెడ్డి పాలనలో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ రోజూ ఏదో ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. రేపల్లె రైల్వేస్టేషన్లో దళిత గర్భిణి మహిళపై అత్యాచారం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని దేవతోటి నాగరాజు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి